తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు కారణం: ఉత్తమ్​

కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పి.. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. కొవిడ్​ కేసుల ఉద్ధృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు.

uttam kumar reddy
కేసుల పెరుగుదలపై ఉత్తమ్​ ఆందోళన

By

Published : May 16, 2021, 3:40 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న బెడ్లు కావాలంటే రోజుకు యాభైవేలు నుంచి లక్ష వరకు ఖర్చుచేయాల్సిన వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మెడికల్​ హబ్​గా ఉన్న హైదరాబాద్​లో వెంటిలేటర్​ సదుపాయం ఉన్న బెడ్లు లేక చాలా మంది మరణిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక కొవిడ్​ బాధితులు మరణిస్తే సర్కార్​ది బాధ్యత కాదా.. అని ఉత్తమ్​ ప్రశ్నించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్​హౌస్​కు వెళ్లాలా అని నిలదీశారు.

పాత్రికేయులను కరోనా ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా గుర్తించాలని డిమాండ్​ చేశారు. కరోనాతో మరణించిన మీడియా ప్రతినిధులకు పరిహారం చెల్లించాలని సూచించారు.

ఇవీచూడండి:భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ABOUT THE AUTHOR

...view details