కార్యకర్తల కృషిని కాంగ్రెస్ ఎప్పటికీ మరిచిపోదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పటేల్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ సాయం చేస్తామని వారి కుటుంబానికి హామీనిచ్చారు.
TPCC Uttam: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్ - ఉత్తమ్ పరామర్శ
కరోనాతో మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పటేల్‌నగర్‌లో ఉన్న నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
![TPCC Uttam: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్ TPCC chief uttam kumar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12002960-994-12002960-1622722249232.jpg)
గాంధీభవన్ ఉద్యోగి షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్‌లో కొనసాగుతూ ఇటీవల మృతి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్ వెల్లడించారు. పార్టీకి వారు చేసిన సేవలను ఎప్పుడూ మరిచిపోదన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సంక్షేమమే అంతిమ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.