ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా ఎదిగితే సీఎం కేసీఆర్ సహించరన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా... అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అయినప్పటికీ రిజర్వేషన్ కల్పించలేదని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే కేసీఆర్ సహించరు: ఉత్తమ్ - దీక్ష విరమించిన రాములు నాయక్
గిరిజన రిజర్వేషన్ల కోసం ఉదయం నిరసన దీక్ష చేపట్టిన రాములు నాయక్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారన్నారు.
హైదరాబాద్‌లో ఇవాళ గిరిజన రిజర్వేషన్ల కోసం ఉదయం నిరసన దీక్ష చేపట్టిన రాములు నాయక్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ఒక్క జీవోతో జరిగే పనికి కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో సాధ్యమైనది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. పోలీసు అధికారులు దిగజారినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెరాసలో మొదట్నుంచి ఉన్నవారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు.