దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భాజపాని గెలిపించడానికి అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బంగ ఎంఐఎం అధ్యక్షుడు ఆరోపించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. భాజపా, ఎంఐఎం రెండు పార్టీలు ఒక్కటేనని ఉత్తమ్ అన్నారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కి, హైదరాబాద్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. భాజపా ఓట్ల కోసం ఎంఐఎం... వీరి ఓట్ల కోసం ఆ పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. వీరి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం పార్థసారథి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
భాజపా, ఎంఐఎం రెండూ ఒక్కటే...: ఉత్తమ్ - తెరాసపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం
భాజపా, ఎంఐఎం పార్టీలు రెండూ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. వీరి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. కష్టసుఖాల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉందని గుర్తు చేశారు.
భాజపా, ఎంఐఎం రెండూ ఒక్కటే...: ఉత్తమ్
కష్టసుఖాల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉందని... ఈ విషయాన్ని హైదరాబాద్ నగర ప్రజలు గమనించాలని ఉత్తమ్ కోరారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకూ కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలి: బండి
Last Updated : Nov 26, 2020, 3:19 PM IST