న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పార్లమెంటులో బిల్లును తీసుకురావడానికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యలను ఖండిస్తూ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన న్యాయవాదుల ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
అధికారంలో ఉన్నవారే వామన్‌రావు దంపతులను హత్య చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఎవరి అండదండలతో నడిరోడ్డుపైనే అంతటి ఘాతుకానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చన్నారు. నాడు న్యాయవాదులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో.. నేడు వారికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని న్యాయవాదులు గ్రహించాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.