తెరాస పతనం ప్రారంభమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించొద్దని ఆయన కోరారు. పంచాయతీ అధికారులను ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన పంచాయతీరాజ్ సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు.
తెరాస పతనం ప్రారంభం: ఉత్తమ్ - తెలంగాణ తాజా వార్తలు
ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన పంచాయతీరాజ్ సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస పతనం ప్రారంభమైందని విమర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని... ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
తెరాస పతనం ప్రారంభం: ఉత్తమ్
గ్రామపంచాయతీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మితిమీరిన జోక్యాన్ని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రుణ యాప్‌లపై దర్యాప్తు ముమ్మరం... అదుపులో నలుగురు
Last Updated : Dec 22, 2020, 2:34 PM IST