మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని వైట్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ మాదిరి వైట్ ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు వస్తానని స్పష్టం చేశారు. ఏ హాస్పిటల్‌కు రమ్మంటే అక్కడికి వస్తానని మంత్రి కేటీఆర్‌కు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
REVANTH REDDY: కేటీఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ - undefined
17:20 September 18
REVANTH REDDY: గ్రీన్ చాలెంజ్ మాదిరి వైట్ ఛాలెంజ్ విసురుతున్నా: రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్ అన్నారు. ఇందుకోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్దామన్నారు. యువతరాన్ని కాపాడే బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక మంత్రిగా మీరెందుకు జోక్యం చేసుకోకూడదని నిలదీశారు. డ్రగ్స్ కేసులో ఈడీకి ఆబ్కారీశాఖ వివరాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఎక్సైజ్‌శాఖ విచారణలో రకుల్‌ప్రీత్, రానా పేర్లు లేవన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచిందన్నారు. రానా, రకుల్‌ప్రీత్‌ను ఎక్సైజ్‌శాఖ విచారణ నుంచి కాపాడిందెవరని ప్రశ్నించారు.
సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఈడీకి అబ్కారీ శాఖ ఎందుకు సహకరించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ నిరాకరిస్తున్నప్పుడు ఒక మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాకు ఆధారాలతో ఫిర్యాదు చేద్దామంటే అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాకు భాజపా నేతలు బండి సంజయ్, అర్వింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. భాజపా చరిత్రను వక్రీకరిస్తోందని ఆక్షేపించారు. రాంజీగోండు, కాశీం రజ్వికి మధ్య వంద సంవత్సరాల తేడా ఉందన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా భాజపా ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ సోయం బాబురావు ఫొటో పెట్టలేదని విమర్శించారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందే తప్ప అమిత్ షా పర్యటన దేనికి ఉపయోగపడలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి:KTR: నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా సిద్ధమే.. రాహుల్ గాంధీ సిద్ధమా!