ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతున్నామనే భయంతో సాగుచట్టాలను మోదీ సర్కార్ వెనక్కి తీసుకుందని...(three farm laws 2020) ఇదే పని ముందే చేస్తే వందలాది రైతులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి((Revanth on farm laws) ) తెలిపారు. అన్నదాతల మరణాలకు కారణమైన మోదీని ఎవరు క్షమించబోరని చెప్పారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు తునాతునకలయ్యాయని రేవంత్ తెలిపారు. దీనిని తన గొప్పతనంగా కేసీఆర్ చెప్పుకోవటం రైతులను అవమానించటమేనన్నారు. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదనేందుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతుల పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆ భయంతోనే నల్లచట్టాలు వెనక్కి..
దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మొదట నుంచి రైతు ఉద్యమాలకు మద్దతునిస్తూ... రైతులకు అండగా కాంగ్రెస్(congress on farm laws) నిలబడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణుల అండతోనే ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో తాను కూడా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నల్లచట్టాలకు(Farm laws India Explained) వ్యతిరేకంగా పాదయాత్ర చేసి... రైతులకు అండగా నిలిచానని గుర్తు చేశారు.
కేంద్రం మెడలు వంచి..
దిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్షతో చేసిన పోరాటం.. ప్రభుత్వం మెడలు వంచి నల్లచట్టాలు వెనక్కి తీసుకునేలా చేసిందన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తుందో...రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారని కొనియాడారు. పార్లమెంటులో చట్టానికి అనుకూలంగా సీఎం కేసీఆర్ ఓటేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాసన సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదన్నారు. కానీ క్రెడిట్ తనదని సీఎం కేసీఆర్(Revanth reddy on kcr) అంటుండడం...రైతులను అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజునే(indira gandhi jayanti) నల్ల చట్టాలు రద్దుతో రైతులు విజయం సాధించారన్నారు. నల్లవ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై దేశ రైతులకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.