తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy On PK: 'ఆరోజు పీకేనే తెరాసను ఓడించాలని చెబుతారు' - Pk news

Revanth Reddy On PK: ప్రశాంత్‌కిశోర్‌, సీఎం కేసీఆర్ రెండ్రోజుల భేటీపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. తెరాసతో తెగదెంపుల కోసమే కేసీఆర్‌ను పీకే కలిశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇకపై ప్రశాంత్‌కిషోర్‌కు, తెరాసకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Apr 25, 2022, 1:44 PM IST

Revanth Reddy On PK: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక ప్రశాంత్ కిశోర్‌తో తెరాసకు, ఐ ప్యాక్‌కు పీకేకు ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్‌ అన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

తెరాసతో తెగదెంపుల కోసమే కేసీఆర్‌ను ప్రశాంత్‌ కలిశారు. ప్రశాంత్ కిశోర్‌కు తెరాసకు ఎలాంటి సంబంధం లేదు. ఐప్యాక్‌తో ప్రశాంత్‌ కిశోర్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరాక రాష్ట్రానికి వస్తారు. నాతో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ ప్రెస్‌మీట్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. తెరాసను ఓడించాలని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడం మీరు వింటారు. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరాక ఆయనకు అధిష్ఠానం మాటే ఫైనల్.

ABOUT THE AUTHOR

...view details