TPCC Chief Revanth Reddy Meet the Press :కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీజేపీకు 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతుఅవుతాయని ఎద్దేవా చేశారు.
Revanth Reddy at Meet the Press Program Hyderabad :డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ గణన(BC Caste Pole) చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా బీజేపీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీగణన చేయలేని పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుందని నిలదీశారు. ఎన్నికల కోసమే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన.. సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసమని అన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని గుర్తుచేశారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని(People War) పేర్కొన్నారు.
రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క
Revanth Reddy Fires on CM KCR : కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని స్పష్టం చేశారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి(KCR Family) తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని వెల్లడించారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ను ప్రజల ముందుంచామని తెలిపారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలని సూచించారు.