హుజూరాబాద్ ఎన్నికల (Huzurabad by elections) తర్వాత తెరాసలో చాలా మార్పులొస్తాయని... ఆ పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (Revanth Interesting Comments) చేశారు. సీఎల్పీలో ఆయన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి (Revanth Reddy Chitchat)లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ తెరాసలో హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తిరుగుబాటు తప్పదన్నారు. విజయగర్జన సభ పెడతామని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోవడానికేనని ఆరోపించారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే ఉన్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలు రావని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న రేవంత్... ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని వివరించారు.
అవే చివరి సభలు...
విజయగర్జన సభలు (TRS Vijaya Garjana) కేసీఆర్ (Cm Kcr) భయంతోనే పెడుతున్నారని ఇవే తెరాసకు చివరి సభలు అవుతాయని పేర్కొన్నారు. హరీశ్‌రావును కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుంచి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో బయటకు వెళ్లడం ఖాయమని ప్రస్తావించారు. ఈటల గెలిచినా.. ఓడినా ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్‌తో పాటు తెలంగాణలో ఎన్నికలు వస్తాయన్నారు. మోదీ డైరెక్షన్లో కేసీఆర్.. గుజరాత్‌తో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసే కుట్ర జరుగుతోందని వివరించారు. ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే పార్టీలో గందరగోళం వస్తుందని కేసీఆర్ చెప్పడం లేదని అన్నారు.