తెలంగాణ

telangana

ETV Bharat / state

వందమంది ప్రశాంత్‌కిషోర్‌లు వచ్చినా కేసీఆర్‌ను కాపాడలేరు : రేవంత్‌రెడ్డి - తెలంగాణ వార్తలు

Revanth reddy comments: వంద మంది పీకేలు వచ్చినా తెలంగాణలో సీఎం కేసీఆర్​ను కాపాడలేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు భయపడి బిహార్ నుంచి ప్రశాంత్‌కిషోర్​ను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ సమీక్షకు హాజరైన ఆయన... ఈ వ్యాఖ్యలు చేశారు.

Revanth reddy comments
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

By

Published : Feb 28, 2022, 4:22 PM IST

Updated : Feb 28, 2022, 5:38 PM IST

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

Revanth reddy comments : వంద మంది ప్రశాంత్‌కిషోర్‌లు, వెయ్యి మంది ప్రకాశ్‌రాజ్‌లు వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్‌ను కాపాడలేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ సమీక్షకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 38లక్షలకు పైగా కాంగ్రెస్‌ సభ్యత్వాలు నమోదయ్యాయన్న రేవంత్‌.... అధికారంలోకి వచ్చాక పథకాల్లో పార్టీ సభ్యులకే తొలిప్రాధాన్యముంటుందన్నారు. కాంగ్రెస్‌కు భయపడిన కేసీఆర్‌... బిహార్‌ నుంచి పీకేని తెప్పించుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

అలసత్వం ప్రదర్శిస్తే... పదవులు పోతాయ్..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్‌ సభ్యత్వాలు నమోదు చేయించడంలో అలసత్వం ప్రదర్శించే నాయకుల పదవులు తొలగిస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 38లక్షలకుపైగా సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు.

సికింద్రాబాద్​లో తక్కువ నమోదు

నల్గొండ, పెద్దపల్లి, మల్కాజిగిరి లోకసభ నియోజక వర్గాలు అత్యధికంగా సభ్యత్వాలు చేసి వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని... సికింద్రాబాద్‌ బాగా వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ నిర్దేశించిన లక్ష్యం దాటి రాష్ట్రంలో సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రతి బూతునకు వంద లెక్కన సభ్యత్వాలు చేయాల్సి ఉందని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, మార్చి 25 వరకు గడువు ఇస్తున్నామని... అప్పటిలోపు చేయనట్లయితే పదవులు తొలగిస్తామని హెచ్చరించారు. కీలక నేతలు సికింద్రాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదులో వెనుకడి ఉండడం ఆందోళనకర విషయమన్నారు. ఏఐసీసీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్‌ సభ్యత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం ఉగాది పచ్చడిలాగా ఉంది. కొంత తీపి, కొంత చేదులా ఉంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు జరిగాయి. సికింద్రాబాద్​లో అతి తక్కువ సభ్యత్వాలు నమోదయ్యాయి. 34,69,053 వెరిఫైయిడ్ సభ్యత్వాలు జరిగాయి. మరో 3,50,000వేల అన్ వెరిఫైయిడ్ సభ్యత్వాలు జరిగాయి. జాతీయ స్థాయిలో బిజీగా ఉండడం వల్ల బూత్ స్థాయిలో సభ్యత్వాలు పట్టించుకోలేదు. బూత్​ల్లో వంద సభ్యత్వాలు పూర్తి చేయకుంటే.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అందరి పదవులు తొలగిస్తాం. మార్చి 25 లోపు ప్రతీ బూత్​లో వంద సభ్యత్వాలు పూర్తి చేయాలి. భాగా పనిచేసిన వారికి పార్టీలో ప్రమోషన్ ఇస్తాం.

-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

పోటీతత్వం పెరిగింది..

ఒకప్పుడు సిద్దాంతాల కోసం పార్టీలు పనిచేశాయని... కానీ ఇప్పుడు పోటీతత్వం పెరిగిందని అన్నారు. కార్యకర్తల కోసం కోట్లాడే భాధ్యత తనదని పేర్కొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఉందని తెలిపారు. ఏఐసీసీ మీటింగ్​ల్లో తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వాల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బిహార్​కు తాకట్టు పెట్టారని విమర్శించారు.

బీహార్ ఐఏఎస్​లకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారు. తెలంగాణ ఐఏఎస్​లకు ఎన్ని శాఖలు ఇచ్చారు? మహేందర్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే.. డీజీపీ పదవికి రాజీనామా చేయాలి. కేసీఆర్ సొంత మీడియా సంస్థల్లో కూడా తెలంగాణ వారిని తొలగించి ఆంధ్రా వాళ్లకు బాధ్యతలు ఇచ్చారు.

-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి:'బాంబుల మోత.. విద్యార్థినులపై సైన్యం వేధింపులు.. ఇంటికెప్పుడు వెళ్తామో!'

Last Updated : Feb 28, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details