ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లాల్లో మే 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాస్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తమ్ సూచించారు. దేశంలో భయానక పరిస్థితులు కల్పిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడం లేదని అన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాస్కుల పంపిణీ - tpcc president utham kumar reddy on corona cases
తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణలో కరోనా వ్యాప్తి, తెలంగాణలో కరోనా కేసులు, తెలంగాణలో మాస్కుల పంపిణీ
ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, నివారణకు మందులు లేవని, వ్యాక్సిన్లు దొరకడం లేదని ఉత్తమ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అన్నారు. ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చదవండి :దేశంలో మరో 3 లక్షల 86 వేల కరోనా కేసులు