తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2020, 11:58 AM IST

ETV Bharat / state

టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుల పరిస్థితి దయనీయం

లాక్​డౌన్​తో టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా భయంతో ఎవరూ బయటకు వెళ్లడానికి సాహసించడం లేదు. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులకు గిరాకీ తగ్గపోయి ఇబ్బందులు పడుతున్నారు.

tours and travels owners phase lot of problems in telangana
దయనీయంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుల పరిస్థితి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని పలు ఐటీ సంస్థలతో పాటు వివిధ వ్యాపార సంస్థలకు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు వాహనాలు అద్దెకు ఇస్తారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపించే వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర వేల వరకు ఉంటాయి. లాక్​డౌన్​తో సుమారు రెండున్నర నెలలు తమ వాహనాలను గ్యారేజ్​కే పరిమితం చేశారు. ఆ తర్వాత కొన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు ప్రారంభమైనా... చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్​కే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇప్పడు వీటికి డిమాండ్ తగ్గిపోయింది.

టాక్స్​ మినహాయించాలి

టూర్స్ అండ్ ట్రావెల్స్ పరిస్థితి లాక్​డౌన్​కు ముందు.. తర్వాత ఏమాత్రం మారలేదని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం స్పందించి ఆరు నెలల టాక్స్​ను మినహాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఏపీలకు వెళ్లే వాహనాల టాక్స్​ను ఏడాది పాటు మినహాయించాలని కోరారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ వాహనాలను ఆర్టీఏ కార్యాలయం పరిసరాల చుట్టూ నిలిపి వెళ్లిపోయారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వాటిని అక్కడే వదిలివెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అప్పులు చేసి కిస్తీలు చెల్లిస్తున్నామని. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:59 చైనా యాప్​లపై నిషేధం

ABOUT THE AUTHOR

...view details