హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో తెలంగాణ ఓనర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను శాలువాతో సన్మానించారు. రెండు విడతల రవాణా మోటారు వాహనాల త్రైమాసిక పన్నును మినహాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పువ్వాడకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
రెండు విడతల రవాణా మోటారు వాహనాల త్రైమాసిక పన్నును మినహాయించినందుకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో తెలంగాణ ఓనర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను శాలువాతో సన్మానించారు. పన్ను మినహాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
లాక్‌డౌన్‌తో రవాణా వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. అందువల్ల తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని క్వార్టర్లీ ట్యాక్స్‌ను మినహాయించాలని వాహన యజమానులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వారి విన్నపం మేరకు రెండు విడతల త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.260కోట్ల మోటారు వాహన యజమానులకు లబ్ధి చేకూరింది.
ఇదీ చదవండి:కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!