ఏపీ విశాఖ జిల్లాలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అరకు బొర్రా గుహల వద్ద పర్యటకుల సందడి నెలకొంది. గత కొన్ని నెలలుగా గుహలు మూతపడి ఉండటం వల్ల పారిశుద్ధ్యం నిర్వహించి పర్యాటకుల కోసం సిద్ధం చేశారు.
బొర్రా గుహల వద్ద పర్యటకుల సందడి - Visakha Borra Caves
అన్లాక్ సడలింపుల వల్ల పర్యాటక ప్రాంతాల్లో క్రమంగా సందడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో పర్యాటక ప్రదేశమైన అరకు బొర్రా గుహల వద్ద పర్యటకుల తాకిడి పెరిగింది.
బొర్రా గుహల వద్ద పర్యాటకుల సందడి
వారాంతపు రోజుల్లో ఈ గుహలను చూసేందుకు సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు. చలికాలం కావడం వల్ల అరకు, బొర్రా గుహలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చదవండి:విద్యుత్ వాహనాలపై ఆసక్తి.. ఛార్జింగ్ కేంద్రాలకు గిరాకీ...