తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం: శ్రీనివాస్​ గౌడ్​ - శ్రీనివాస్​ గౌడ్​ తాజా వార్తలు

ప్రపంచ ముఖచిత్రంలో తెలంగాణ పర్యటక రంగానికి చోటు లభించేలా కృషి చేస్తున్నామని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్ లుంబినీ పార్క్‌ను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు.

tourism minister srinivas goud visited lumbini park in hyderabad
పర్యటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం: శ్రీనివాస్​ గౌడ్​

By

Published : Dec 18, 2020, 7:38 PM IST

పర్యటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ ‌గౌడ్ హైదరాబాద్​లోని లుంబినీ పార్క్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సందర్శకుల రద్దీ, బోటింగ్ కేంద్రం పనితీరు పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో ఎలక్ట్రానిక్ క్రూయిజర్, సోలార్‌ బోట్ ఏర్పాటు చేయబోతున్న దృష్ట్యా.. ఆ నిర్మాణ పనులు పరిశీలించారు. రెండస్తుల బోట్ అంతా కలియ తిరిగి.. వివరాలు అడిగి తెలుకున్నారు.

అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ బోట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక బోటులో మంత్రి షికారు చేశారు. బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. కొద్దిసేపు పర్యాటకులతో ముచ్చటించారు. సాధారణంగా హైదరాబాద్ అనేగానే హుస్సేన్‌సాగర్‌, బుద్ధ విగ్రహం గుర్తుకొస్తాయని శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు.

హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో నూతనంగా రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎలక్ట్రికల్ క్రూయిజర్​ 80 సీట్ల సామర్ధ్యం కలిగిన ఆధునిక హంగులతో కూడిన మూవింగ్ రెస్టారెంట్లు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. చక్కటి అనుభూతి ఇచ్చే ఈ బోట్లలో జన్మదినోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉండేలా తీర్చిదిద్దుతాం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దుర్గం చెరువులో కూడా రెండు బోట్లు ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో... కరోనా కొంత తగ్గినప్పటికీ మళ్లీ ఇటీవల కాలంలో బాగా పుంజుకుంది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

వి.శ్రీనివాస్‌గౌడ్‌, పర్యటక శాఖ మంత్రి

ఇదీ చదవండి:ఆదిలాబాద్‌ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం

ABOUT THE AUTHOR

...view details