రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3042కు చేరింది. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలు సేకరించారు.
కొవిడ్ బాధితుల్లో 2092 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 70 కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్ కేసులున్నాయి.