ఆంధ్రప్రదేశ్లోని యానాం పరిధిలోని ఫరంపేటలో సుడిగుండం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ ఇటువంటి సుడిగుండాలు చూడలేదన్నారు. సుమారు మూడు నిమిషాల పాటు సుడిగుండం ఉంది. స్థానికంగా ఉన్న గోదావరి నుంచి సోసైటి భూములలోకి వచ్చింది.
యానాంలో భారీ సుడిగుండం..ఆసక్తిగా వీక్షించిన స్థానికులు - eastgodavari district latest news
ఆంధ్రప్రదేశ్లోని యానాం నియోజకవర్గ పరిధిలోని ఫరంపేటలో సుడిగుండం హల్చల్ చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు మూడు నిమిషాల పాటు చెరువులో సుడిగుండం ఉంది.
tornados-at-yanam-constency-eastgodavari-district
ఈ సుడిగుండంలో స్థానికంగా ఉన్న రొయ్యల చెరువు, గడ్డివాము, పలు షెడ్లు ధ్వంసమయ్యాయి. గడ్డివాములు చెల్లాచెదురై రొయ్యల చెరువులో పడిపోయాయి. ప్రజలు ఆశ్చర్యానికి గురై ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించారు.