తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోని యానాంలో టోర్నడో.. మేఘాల్లోకి మోటార్లు! - taja news of tornado

టోర్నడోలను తలపించేలా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా యానాంలోని తీర గ్రామాల వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది. దాదాపు 20 నిమిషాల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దీని తీవ్రతకు స్థానిక రొయ్యలచెరువుల్లోని నీరు నింగి వైపు ఎగసింది.

tornado-in-yanam-it-creates-lakhs-property-loss
యానాంలో టోర్నడో.. మేఘాల్లోకి మోటార్లు!

By

Published : Jul 18, 2020, 9:49 AM IST

యానాంలో టోర్నడో.. మేఘాల్లోకి మోటార్లు!

అమెరికా లాంటి దేశాల్లో సంభవించే టోర్నడోలను తలపించేలా ఆంధ్రప్రదేశ్​ యానాంలోని తీర గ్రామాల వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఫరంపేట చేరువలోని గోదావరి లంకభూముల్లో మొదలైన సుడిగాలి అయ్యన్ననగర్‌ వద్దకు వచ్చేసరికి ఉద్ధృతమైంది. దీని తీవ్రతకు స్థానిక రొయ్యలచెరువుల్లోని నీరు నింగి వైపు ఎగిసింది.

రొయ్యల చెరువుల్లోని 25 కిలోల బరువుండే రేడియేటర్లు, మోటార్లు గాలిలోకి దాదాపు వంద మీటర్ల ఎత్తుకు వెళ్లి నేలపై పడి ధ్వంసమయ్యాయి. రేకులషెడ్లు, చెట్లు నేలకూలాయి. అయ్యన్ననగర్‌, ఫరంపేట, నీలపల్లి, వైఎస్‌ఆర్‌కాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సుడిగాలి తీవ్రతకు చెరువులో కాసేపు నిప్పులు కనిపించటంతో అంతా ఆందోళన చెందారు. దాదాపు 20 నిమిషాల పాటు ఉన్న సుడిగాలి.. రొయ్యల చెరువులపై ఎనిమిదిన్నర నిమిషాల పాటు ఉంది. ఈ ఉపద్రవంతో రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు. సుడిగాలి అనంతరం కురిసన భారీ వర్షానికి ఆకాశం నుంచి రొయ్యలు పడినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి:జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

ABOUT THE AUTHOR

...view details