తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9PM - ts latest news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOPTEN NEWS@9PM
టాప్​టెన్ న్యూస్@9PM

By

Published : Jun 24, 2020, 8:59 PM IST

కరోనా@10వేలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 891 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,444కు చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అన్ని పరీక్షలు రద్దు!

అన్ని వర్సిటీలు, కళాశాలల్లో పరీక్షలు రద్దు చేయడానికి యూజీసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

విద్యార్థులకు ఉపశమనం

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఈ నెల 30 వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలకు కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సీసీఎస్ కష్టాలు

అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తాయని జీతంలో నుంచి కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎస్ ఖాతాలో జమ చేసుకున్నారు. అవసరమైన సమయంలో ఆదుకోకుండా చేతులెత్తేసింది సీసీఎస్. తమ డబ్బులు తీసుకోలేక... బయట అప్పు పుట్టక కార్మికులు తల్లడిల్లిపోతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఆధారాల్లేవ్!

యావత్ సమాజాన్ని కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతదేహాలకు తప్పకుండా పరీక్షలు చేయాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

చైనా డీల్​పై చిక్కుల్లో..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ హయాంలో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను దాచిపెట్టడంపై ఈ వ్యాజ్యం వేశారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

కేరళలో కరోనా 2.0

భారత్​లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. తమిళనాడులో కొత్తగా 2,865 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 67,468మంది కరోనా బాధితులుగా మారారు. కేరళలో రికార్డు స్థాయిలో 152 మందికి మహమ్మారి నిర్ధరణ అయింది.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ప్రధానికి షాక్

కరోనా వేళ సింగపూర్​లో రాజకీయం రసవత్తంగా మారుతోంది. ఎన్నికలకు మరో నెల రోజులుగా ఉండగా.. ప్రధాని లీ షియాన్ లూంగ్​ సోదరుడు లీ షియాన్ యాంగ్​ ప్రతిపక్ష పార్టీలో చేరారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

యాషెస్​తో సమానం

భారత్​తో టెస్టు సిరీస్​ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ నాథన్​ లైయన్​. యాషెస్​ సిరీస్​ లాగే టీమిండియాతో సిరీస్​ కూడా ఆసక్తికరంగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

పోస్ట్‌మార్టం నివేదిక

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ సింగ్​ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్​మార్టం రిపోర్టును పోలీసులకు సమర్పించారు వైద్యులు. ఉరి వేసుకోవడం వల్లే ఊపిరాడక మరణించినట్లు తేలింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details