తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOPTEN NEWS@5PM
టాప్​టెన్ న్యూస్@5PM

By

Published : Jun 21, 2020, 4:57 PM IST

పట్టపగలే చీకటి

సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. సంపూర్ణ సూర్యగ్రహణంతో పట్టపగలే చీకటి అలుముకుంది. ఆ దృశ్యాలు మీకోసం.

నిలబడ్డ రోకలి

గ్రహణంపై ప్రజల్లో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. అయితే సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ తాంబాలంలో నీళ్లు పోసి రోకలిని నిలబెట్టింది.తర్వాత ఏమైందంటే!

పచ్చని పల్లె

పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలుస్తోంది ఆ పల్లె. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంది. ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. ఇంతకీ ఆ పల్లె ఎక్కడుంది? మీరూ తెలుసుకోండి.

మంత్రి ఆసనాలు

అంత‌ర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో యోగాస‌నాలు వేశారు. మంత్రి ఆసనాలు మీరూ చూసేయండి.

తుపాకులకు సై

గల్వాన్​ లోయ ఘటనతో వాస్తవాధీన రేఖ వెంబడి 'రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​'లో కీలక మార్పులు చేసింది భారత్​. అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే!

స్పెల్లింగ్ మిస్టేక్

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్​తో మళ్లీ దొరికిపోయారు రాహుల్​. ఇంతకీ ఆయన చేసిన ఆ ట్వీట్​ ఏంటి?

ట్రంప్​ రూటే సెపరేటు

సంచలన నిర్ణయాలు, ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్​ రూటే సెపరేటు. అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో వైరస్​ టెస్ట్​లను తగ్గించాలని అధికారులకు ఆదేశించారు ట్రంప్​.ఆయన వ్యాఖ్యల వెనుక కారణాలేంటి?

'నాన్నకు ప్రేమతో'

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.ఆ పోస్టులను మీరూ చూడండి.

కీపర్ కారు నుజ్జునుజ్జు

ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో అఫ్గాన్ వికెట్​ కీపర్ అఫ్జర్ జజాయ్, చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details