తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@5PM - టాప్​టెన్ న్యూస్​@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

Topten news@5PM
టాప్​టెన్ న్యూస్​@5PM

By

Published : Jun 13, 2020, 5:02 PM IST

పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్ని శాఖలకు విస్తరిస్తున్న కరోనా వైరస్... జీహెచ్​ఎంసీలో పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి సోకింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

రెండు రోజులపాటు వర్షాలు

రాష్టంలో ఈరోజు నుంచి మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఎక్కడెక్కడంటే

రైతు బాగుంటేనే

స‌హ‌కార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి నిజ‌మైన స‌హ‌కారం అందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే!

సింగరేణికి కరోనా సెగ

నల్ల బంగారానికి విఫణిలో డిమాండ్ తగ్గిన కారణంగా ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా ప్రభావం అన్నింటితో పాటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై కూడా గణనీయంగా కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

నిలకడగానే

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు మీకోసం.

కరోనా ఉగ్రరూపం

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు మొత్తం 3 లక్షల మందికి పైగా వైరస్​ సోకినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో సగానికి పైగా దేశంలోని ప్రముఖ నగరాల్లోనే నమోదైనట్లు తెలిపింది. అవేంటంటే!

వ్యాప్తిలేదు

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి ఎప్పుడో ప్రారంభమైందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించడంలో మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఫాలో అవ్వండి.

4 నెలల తర్వాత

హాంకాంగ్​లో కరోనా సంక్షోభం వల్ల మూతపడ్డ 'ఓషన్​ పార్క్​'​ నాలుగు నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. పార్క్ ప్రారంభమైనట్లు ​ తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ విశేషాలు మీకోసం.

సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్​తో తెరకెక్కిన అనేక హాలీవుడ్​ చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.

అఫ్రిదీకి కరోనా

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details