తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@ 5PM - telangana latest news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

topten-news-at-5pm
టాప్​టెన్ న్యూస్@ 5PM

By

Published : Jun 12, 2020, 4:59 PM IST

హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

హైకోర్టులో పోలీసులపై ఎంపీ రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌పై వ్యాజ్యం వేశారు. డ్రోన్ చిత్రీకరణ ఆరోపణలపై అరెస్టు చేసిన సమయంలో నార్సింగి పోలీసులు.. తీరుపై పిటిషన్​ వేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.

జాగా కనబడితే మొక్క నాటేయండి

అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 129 ప్రాంతాల్లోని 188 ఫారెస్ట్ బ్లాక్​లకు సంబంధించిన లక్షా 60వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎస్​ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్​లపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో చర్చకొచ్చిన అంశాలు ఏమిటంటే..

కట్టడి చేసే వారినే కమ్మేస్తోంది

హైదరాబాద్ నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులతోపాటు.. పలు శాఖల ప్రభుత్వ అధికారులు సైతం కొవిడ్ మహమ్మారి కాటుకు గురవుతున్నారు. తాజాగా ఉస్మానియా మెడికల్​ కళాశాలలో మరొకరికి వైరస్​ సోకిన విషయం ఆల్యంగా వెలుగు చూసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లేఖ

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్​కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. దోహ, ఖతర్ దేశాల నుంచి హైదరాబాద్​కు విమానాల సంఖ్యను పెంచాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ఈ అంశాలను ప్రస్తావించారు.

ఇష్టమైన అల్పాహారం ఇకపై మరింత ప్రియం

రాత్రి డిన్నర్​లో ఎక్కువ మంది అల్పాహారం తీసుకుంటారు. రోటీ, పరోటా, దోశ వంటి వాటికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయితే... రోటీపై 5 శాతం జీఎస్​టీ ఉండగా.. పరోటాను 18 శాతం జీఎస్​టీ శ్లాబులో చేర్చారు. ప్రస్తుతం ఈ వర్గీకరణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ వర్గీకరణ ఎలా చేశారంటే..

ఆలస్య రుసుము నుంచి జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య ఎలాంటి బకాయిలు లేకుండా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారిపై ఆలస్య రుసుము విధించబోమని చెప్పారు. జీఎస్టీ మండలి​ సభ్యులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈ మేరకు జీఎస్టీ దాఖలుపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఆలస్య రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక ప్రైమ్​ ఉచితం

రిలయన్స్​ జియో.. సరికొత్త ఆఫర్​తో వినియోగదారుల ముందుకొచ్చింది. జియో ఫైబర్​ కనెక్షన్​ తీసుకుంటే ఏడాది పాటు అమెజాన్​ ప్రైమ్​ను ఉచితంగా ఇవ్వనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆరంభం డీలా... ముగింపు భళా

వారాంతంలో స్టాక్ మార్కెట్లు అనుహ్యంగా లాభాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్ల ప్రతికూలతలతో ఆరంభంలో కుదేలైన సూచీలు.. చివరి గంటలో ఒక్క సారిగా లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్​ కబుర్లు ఇలా ఉన్నాయి.

వారిద్దరూ దూరం

ఆగస్టులో జరగనున్న ఇంగ్లాండ్​ పర్యటనకు పాకిస్థాన్​ క్రికెటర్లు హరిస్​ సోహైల్​, మహ్మద్​ ఆమిర్​లు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వైదొలిగినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అసలు ఎందుకు వైదొలిగారంటే..

నాకు అప్పుడే వద్దు డాడీ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెట్టింట ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో తనయ అర్హాతో కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

ABOUT THE AUTHOR

...view details