సరైన సమాధానం చెప్తాం
సరిహద్దుల్లో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా. గల్వాన్ లోయలో మృతి చెందిన సైనికుల త్యాగాలను వృథాగా పోనివ్వమన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే!
ఎయిర్‌ఫోర్స్ పరేడ్
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. వైమానిక దళ అధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ముఖ్య అతిథిగా హాజరై గౌరవవందనం స్వీకరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
డ్రోన్ కూల్చివేత
భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ఓ పాక్ డ్రోన్‌ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్‌ను పరిశీలించిన సైన్యం దానిపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపి నేలకూల్చింది. ఎక్కడ కూల్చారో తెలుసుకోండి.
భారీగా కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,516 కేసులు నమోదయ్యాయి. మరో 375 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
జాడేది
మొదట చిరుత పులి అన్నారు... దాని కోసం అటవీ అధికారులు గంటల తరబడి వెతికారు. అయినా చిక్కలేదు... అది పులికాకపోవచ్చు... అడవి పిల్లి కావచ్చని భావించారు. చిరుత ఎక్కడ సంచరిస్తుందో తెలుసుకోండి.