తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 1PM - తెలుగు వార్తలు తెలంగాణ తెలుగు వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-telugu-news-in-telangana
టాప్​టెన్​ న్యూస్​@ 1PM

By

Published : Feb 17, 2022, 12:59 PM IST

  • విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం... తొలిసారిగా ఇవాళ భేటీ అయింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ సమావేశానికి.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్ హాజరయ్యారు. ఇవాళ ఉదయం11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ ప్రారంభమైంది.

  • 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

దక్షిణ కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతరలో రెండు దశాబ్ధాల తర్వాత అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవ్వడం ఇదే తొలిసారి. ఆదివాసీ జనజాతరకు రెండో రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తోన్న భక్తులతో అమ్మవారి ప్రాంగణం కిటకిటలాడుతోంది.

  • కేసీఆర్ బర్త్‌డే.. ప్రతిపక్షాలకు జైలు డే..!

కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు.

  • ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నియమించనుంది. రెండురోజుల క్రితం వరకు డీజీపీగా కొనసాగిన ఆయన్ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్‌ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి పదవి ఖాళీగా ఉంది.

  • రన్నింగ్ ట్రైన్ కింద పడ్డ తండ్రి

Father suicide running train: ఆరేళ్ల కొడుకుతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు ఓ వ్యక్తి. బాలుడు ప్రాణాలతో బయటపడగా.. అతడి తండ్రి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.

  • మోకాలి లోతు మంచులో పహారా

ఎముకలు కొరికే చలి.. ఆపై విపరీతమైన మంచు. అలాంటి కఠినమైన చోట భారత సైనికులు పహారా కాస్తున్నారు. ఉత్తరాఖండ్​ హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. హిమపాతం అధికంగా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుకు తావు లేకుండా సరిహద్దులో పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు ఐటీబీపీ జవాన్లు. 15 వేల అడుగుల ఎత్తులో.. బలమైన రోప్​లను ఆధారంగా చేసుకొని మోకాలి లోతు మంచులో తిరుగుతూ కాపలా కాస్తున్నారు.

  • ఉక్రెయిన్ సరిహద్దుకు మరిన్ని బలగాలు

ఉక్రెయిన్‌పై ఏ క్షణమైన రష్యా దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. రసాయన ఆయుధాలు లేదా తమ సైనికులపై దాడిచేశారనే తప్పుడు ఆరోపణలతో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగవచ్చని శ్వేతసౌధం తెలిపింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టేందుకు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగే సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు, విదేశాంగ మంత్రిని అగ్రరాజ్యం పంపనుంది.

  • స్టాక్ మార్కెట్లు- లాభనష్టాల దోబూచులాట

స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్న సెన్సెక్స్.. ప్రస్తుతం 128 పాయింట్లు వృద్ధి చెందింది. 58,125 వద్ద కదలాడుతోంది.

  • శ్రేయస్​ను అందుకే తుది జట్టులోకి తీసుకోలేదు

వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో విజయంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఈ గెలుపు తమ జట్టులో మరింత ధైర్యాన్ని నింపిందని చెప్పాడు. రవిబిష్ణోయ్​ ప్రతిభావంతుడని, అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. తుదిజట్టులోకి శ్రేయస్​ అయ్యర్​ను ఎందుకు తీసుకోలేదో వివరించాడు.

  • మరోసారి చైతూతో కలిసి పూజాహెగ్డే సినిమా !

Nagachaitanya pooja hegdey: దర్శకుడు వెంకట్​ ప్రభు-నాగచైతన్య కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్​గా పూజాహెగ్డేను ఎంపిక చేసే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ABOUT THE AUTHOR

...view details