తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్ న్యూస్ @ 3PM - Telangana news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@3PM
టాప్​టెన్ న్యూస్@3PM

By

Published : Feb 7, 2021, 3:00 PM IST

1. తెరాస కార్యవర్గ సమావేశం

తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, కమిటీల నియామకంపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. మనస్పర్థలు సహజం​

ఈనెల 14 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. గంటలో కోటి మొక్కలు

ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. వారిపై వైద్య విద్యా శాఖ వేటు

ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తూ.. అనధికార సెలవుల్లో ఉన్న వారిపై వేటు వేసేందుకు రాష్ట్ర వైద్య విద్యా శాఖ రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఆపరేషన్​ ఉత్తరాఖండ్​

ఉత్తరాఖండ్​ ఘటనలో సహాయ చర్యల కోసం చాపర్లు, బలగాలను సైన్యం రంగంలోకి దింపింది. రిషికేశ్​లోని సైనిక స్థావరాన్ని కేంద్రంగా చేసుకుని... ఉత్తరాఖండ్​ ప్రభుత్వం, ఎన్​డీఆర్​ఎఫ్​తో కలిసి పనిచేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. మోదీ, షా భరోసా

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సమీక్షించారు. ముఖ్యమంత్రి టీఎస్​ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఆరోగ్య రంగం పటిష్ఠం

దేశంలో ఆరోగ్య రంగం అన్నిరకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్పష్టం చేశారు. బెంగళూరులోని రాజీవ్​గాంధీ హెల్త్ సైన్సెస్​ విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. తైవాన్​లోకి చైనా!

చైనా నిఘా విమానం తమ​ భూభాగంలోకి ప్రవేశించినట్టు తైవాన్​ రక్షణ శాఖ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్​ నియంత్రణ భూభాగంపై వై-8 విమానం విహరించినట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'సలార్​' విలన్​ ఫిక్స్

రెబల్​స్టార్​ ప్రభాస్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న 'సలార్​' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కన్నడ నటుడు మధూ గురుస్వామి విలన్​గా ఎంపికయ్యారని ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. అక్తర్​ అలీ కన్నుమూత

భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, డేవిస్​ కప్​ మాజీ కోచ్​ అక్తర్ అలీ మృతి చెందారు. క్యాన్సర్​ సహా పలు అనారోగ్య సమస్యలతో రెండు వారాల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details