1. తెలంగాణ.. ఒప్పందాలు ఉల్లంఘిస్తోంది
కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్ దాఖలు చేశారు. హౌస్‌మోషన్ పిటిషన్ వేసిన ఆ రైతు... ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ వ్యాజ్యంలో పేర్కొన్నారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.ఎస్బీఐ ఏటీఎంలో వింత సమస్య
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో వింత సమస్య తలెత్తింది. రాంనగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎంలో కస్టమర్లు నగదు విత్‌డ్రా చేస్తే వారి ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఈ విధంగా రూ.3.40 లక్షలు విత్‌డ్రా జరిగింది. సాఫ్ట్‌వేర్ లోపంతో సాంకేతిక ఆధారాలు లభించలేదు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. టీకా పంపిణీలో మరో మైలురాయి
టీకా పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. మొత్తం మీద 35కోట్లకుపైగా టీకాలను పంపిణీ చేసింది. అటు దేశంలో కొత్తగా 43,071 కరోనా కేసులు నమోదయ్యాయి. 52,299 మంది కోలుకోగా 955మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పాత మందులకు కొత్త పదును
కరోనాకు కొత్త మందులు కనుగొనే లోపు ఎబోలా, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా వంటి రోగాలకు వాడుతున్న పాత మందులను తగు మార్పుచేర్పులతో ఉపయోగిస్తున్నారు. గతంలో క్యాన్సర్ చికిత్సకు డీఆర్డీఓ రూపొందించిన 2డీజీ పొడి ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న కొవిడ్ రోగులపై సమర్థంగా పనిచేస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సముద్రంలో సాగు...
ఎక్కువగా కురిసినా వరదలొస్తాయన్న చింత ఉండదు.. పంటకి తెగుళ్లొస్తాయని కానీ పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోందని కానీ ఆందోళన అక్కర్లేదు.. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏ పంట కావాలంటే ఆ పంట పండించొచ్చు.. ఎక్కడుందీ అలాంటి బంగారులోకం అంటే- సముద్రం లోపల. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.