వైరల్ లోడ్ ఎంత
హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటల్లో కరోనా వైరల్ లోడ్ అంచనా కోసం నమూనాల సేకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్‌లో రెండుసార్లు నీటి నమూనాలు సేకరించగా.. వైరస్ ఆనవాళ్లు గుర్తించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాగర్‌లోకి శుద్ధి చేసిన మురుగునీటిని వదలడంతోనే కొవిడ్ ఆనవాళ్లు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు రూపొందించింది. ఈ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున వీటిని జారీ చేసింది. ప్రతి గ్రామంలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా అంటే భయం లేదు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఎంతో మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా... ఇప్పటీకీ కొవిడ్ అంటే చాలామందిలో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. ముషిరాబాద్ చేపల మార్కెట్లో ఆదివారం పరిస్థితిని చూస్తే... అది నిజమనే అనిపిస్తుంది. నిబంధనలు పాటించకుండా ఇలాగే కొనసాగితే మహమ్మారి రెండో దశ ఫలితాలు దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంపై తౌక్టే ఎఫెక్ట్
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని, పంటను కాపాడుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సమాధుల కలకలం
గంగానది తీరంలో మృతదేహాలను పాతిపెట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో మరొకటి వెలుగు చూసింది. ప్రయాగ్‌రాజ్‌లోని దేవరఖ్ ఘాట్ వద్ద భారీ సంఖ్యలో సమాధులు కనిపించాయి. కన్నౌజ్ జిల్లాలో మహాదేవి ఘాట్ వద్ద మృతదేహాలు నీటిలో కొట్టుకురావడం కనపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.