తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Feb 10, 2022, 1:00 PM IST

  • సీఎం జగన్​తో చర్చలో పాల్గొన్న సినిమా హీరోలు, దర్శకులు వీళ్లే...

Tollywood Celebrities Meet AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

  • 11 గంటల వరకు 20 శాతం పోలింగ్​

ఉదయం 11 గంటల వరకు ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 20.03 శాతం పోలింగ్​ జరిగింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. మరికాసేపట్లో పెళ్లి అనగా ముజఫర్​నగర్​లోని ఓ పోలింగ్​ కేంద్రానికి.. ఓటేసేందుకు వచ్చాడు వరుడు. అందరూ అతడిని ఆశ్చర్యంగా చూశారు. ముందు ఓటు.. తర్వాతే పెళ్లి అని అతడు మీడియాతో చెప్పడం విశేషం.

  • కరోనా వేళ 'ఓట్ల' పండగ

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తొలి విడతలో మొత్తం 11 జిల్లాల్లోని 58 స్థానాలకు పోలింగ్​ నిర్వహిస్తోంది భారత ఎన్నికల సంఘం(ఈసీ). మొత్తం 7 విడతల ఎన్నికల అనంతరం.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

  • 'హిజాబ్'​ వివాదం కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ

Hijab Row Case: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ అంశంపై విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్‌ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం సరికాదని అభిప్రాయపడింది.

  • నిరుద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం..

Unemployees protest: ఆంధ్రప్రదేశ్​లో కలెక్టరేట్ల ఎదుట విద్యార్థి ఉద్యమం దద్దరిల్లింది. ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

  • ఆర్డీఎస్‌ కుడికాలువ, తుమ్మిళ్ల ఆపండి..

Krishna Board Suggestions to Telegu States: ఆర్డీఎస్​ కుడికాలువ నిర్మాణం ఆంధ్రప్రదేశ్​ చేపట్టవద్దని, తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్వహణను తెలంగాణ నిలిపివేయాలని కృష్ణా బోర్డు సూచించింది. ట్రైబ్యునల్‌ తీర్పు అమలు వరకు వేచిచూడాలని తెలుగు రాష్ట్రాలకు తెలిపింది.

  • బాలికపై సామూహిక అత్యాచారం

Gang Rape News: 17ఏళ్ల బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం ఆశ చూపి.. అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో జరిగింది.

  • ఆర్​బీఐ ప్రకటనతో జోష్

కీలక రెపో, రివర్స్​ రెపో రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్ల భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్లు పెరిగి.. 58 వేల 965 వద్ద కొనసాగుతోంది.

  • 'కోహ్లీ చేతుల మీదుగా భారత్ క్యాప్..'

కోహ్లీ చేతుల మీదుగా టీమ్​ఇండియా క్యాప్​ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి అని దీపక్ హుడా చెప్పాడు. రోహిత్, ద్రవిడ్, కోహ్లీ లాంటి స్టార్స్​తో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు.

  • పబ్లిక్​లో హీరోయిన్ స్నానం..

Saniya iyappan: ఓ రిసార్ట్​లో ఓపెన్​గా స్నానం చేసిన హీరోయిన్ సానియా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details