ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుయూపీ తొలి దశ పోలింగ్ షురూ.. 58 స్థానాల్లో పోరు UP Election Phase 1: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.'ఇదెక్కడి గందరగోళం.. నచ్చని వాటిల్లోనూ చేరాల్సి వస్తోంది'Medical Admissions: వైద్యవిద్య ప్రవేశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే దఫా ఐచ్ఛికాల నమోదు ప్రక్రియతో.. నచ్చని వాటిల్లోనూ చేరాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కళాశాలలో చేరాలో? దేనిలో వద్దో? అనే సంకట స్థితి విద్యార్థుల్లోనే కాకుండా వారి తల్లిదండ్రుల్లోనూ నెలకొంది.అందాల ద్వీపం అభివృద్ధికి పర్యాటక శాఖ యోచన island in krishna river: నల్గొండ జిల్లాలో స్థానికంగా చాకలిగట్టుగా పిలిచే ద్వీపాన్ని అభివృద్ధి చేస్తే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని భారీగా ఆకర్షించవచ్చని పర్యాటకశాఖ భావిస్తోంది. ఈ ద్వీపాన్ని ప్రకృతి, సాహస పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశం ఆలోచన రూపంలో, ప్రాథమికస్థాయిలో ఉందని పర్యాటకశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈఆర్‌సీకి గణాంకాలతో ఎఫ్‌టీసీసీఐ ఫిర్యాదువిద్యుత్ కొనుగోలు, సరఫరా, పంపిణీ వ్యయం ఎక్కువ చూపుతూ డిస్కంలు కరెంటు ఛార్జీల రూపంలో వినియోగదారులపై భారం మోపాలని చూస్తున్నాయని ఎఫ్‌టీసీసీఐ ఈఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. పలు గణాంకాలను కూడా ఈఆర్‌సీకి అందజేసింది. ఈ నెల 18 నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలో నాలుగు చోట్ల ఈఆర్సీ ఇలాంటి ఫిర్యాదులపై బహిరంగ విచారణ నిర్వహించి తుది తీర్పు వెలువరిస్తుంది.ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరలు Bathukamma Sarees: బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.గుప్తనిధినిచ్చి.. ఉరికంబమెక్కి!ఆయనేమీ ఆయుధాలు పట్టలేదు.. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలూ చేయలేదు. ఎన్నడూ పల్లెత్తు మాటనలేదు. కానీ.. కీలక సమయంలో తమ ప్రత్యర్థికి 'గుప్త'సాయం చేశాడని ఆంగ్లేయ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. అలా స్వాతంత్య్ర భారతావని కోసం మౌన పోరాటం చేసి ప్రాణాలర్పించిన విస్మృతవీరుడు అమర్‌చంద్ బాంతియా!'కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్' WHO on Covid Variants: కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని ప్రపంచదేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా వెలుగుచూసిన ఒమిక్రాన్ ఉపవేరియంట్ అంతకుముందు ఉన్న ఉపవేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అదే సమయంలో వ్యాక్సిన్లు రక్షణనిస్తున్నాయని తెలిపింది. ఎన్నికల తర్వాత ధరల మోతే!Product Price Hike: కరోనా సంక్షోభం సామాన్యుడిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది చాలదన్నట్లు నిత్యసవర వస్తువులు సహా వివిధ ఉత్పత్తుల ధరల పెరుగుదల మరింత వేదన మిగులుస్తున్నాయి. మూడు నెలలు పెరుగుదలకు విరామిచ్చిన పెట్రోల్ ధరలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అమాంతం ఆకాశాన్ని అంటుతాయని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు మొబైల్ టారిఫ్ రేట్లు మళ్లీ పెంచనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.'పంత్ ఆ స్థానంలో బ్యాటింగ్.. ప్రయోగం మాత్రమే' India vs west indies: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ గెలిచిన రోహిత్ శర్మ.. తమ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్‌ను ఓపెనర్‌గా తీసుకురావడం శాశ్వతమేం కాదని అన్నాడు.'మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలని ఉంది'విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్‌బాబు.. తన కెరీర్ విశేషాలను పంచుకున్నాడు. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు.