తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Feb 8, 2022, 10:59 AM IST

  • భారీగా తగ్గిన కొవిడ్​ కేసులు- 1,118 మరణాలు

Covid Cases in India: భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 67,597 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 1,188 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • ఎంపీ పదవి వద్దు.. ఎమ్మెల్యేనే కావాలి!

Telangana Congress MPs : రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. సభ్యత్వ నమోదుతో కసరత్తు ప్రారంభించిన హస్తం పార్టీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ఫోకస్ పెడుతోంది. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు.

  • ఫోర్బ్స్ జాబితో చోటు దక్కించుకున్న హైదరాబాద్​ అంకుర సంస్థ

Hyderabad Startup Donate Kart: ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితా-2022లో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులకు చోటు దక్కింది. స్వచ్ఛంద సంస్థలు, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునే దాతలకూ మధ్య ఈ సంస్థ వారధిలాగా పనిచేస్తుంది. ఫోర్బ్స్‌ ‘ఎన్‌జీఓలు-సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో వీరు ఎంపికయ్యారు.

  • రైలు ఎక్కుతూ జారిపడ్డ ప్రయాణికుడు... కాపాడిన కానిస్టేబుల్

వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు జారి పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఆయనను కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్ రైల్వే స్టేషన్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • భాజపా ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మహిళపై రివర్స్​ కేసు

Sexual Harassment Case on BJP MLA: తనను 14 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని భాజపా ఎమ్మెల్యేపై ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ మహిళే తనను బ్లాక్​మెయిల్​ చేస్తూ.. రూ.2 కోట్లు డిమాండ్​ చేస్తుందని ఆరోపిస్తూ ఆమెపై ఫిర్యాదు చేశారు ఆ ఎమ్మెల్యే.

  • ఒమిక్రాన్‌.. పరిశీలన టీకా తయారీకి అనుమతి పొందిన సీరం

Omicron Vaccine SII: ఒమిక్రాన్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పరీక్షలు, విశ్లేషణ కోసం అవసరమైన టీకాను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

  • ఇజ్రాయెల్‌లోనూ పెగసస్​ రగడ.. మాజీ ప్రధాని కుమారుడి ఫోన్ హ్యాక్​!

Israel Police use of Pegasus: ఇజ్రాయెల్‌ పోలీసులు పెగసస్​ స్పైవేర్‌ను ఉపయోగించి ఆ దేశంలోని డజన్ల కొద్ది ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ ఓ మీడియా సంస్థ తన కథనంలో రాసుకొచ్చింది. హ్యాక్‌కు గురైన వారిలో దేశ మాజీ ప్రధాని బెంజ్‌మిన్‌ నెతన్యాహు కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొంది.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?

  • కెప్టెన్​ కోసం ఎంతకైనా.. ఐపీఎల్​ జట్ల కసరత్తు

IPL 2022: మెగావేలం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఐపీఎల్‌ జట్లు. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ కోసం చూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ అందుకు ఏయే ఆటగాళ్లపై కన్నేశాయన్నది ఆసక్తికరంగా మారింది. సరైన కెప్టెన్‌ కోసం ఆ జట్లు భారీగానే చెల్లించే అవకాశం ఉంది.

  • మహాభారతం నటుడు ​ ప్రవీణ్​ కుమార్​ కన్నుమూత

ప్రముఖ అథ్లెట్​, మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

ABOUT THE AUTHOR

...view details