తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top-ten-news-till-now
టాప్​టెన్​ న్యూస్

By

Published : Feb 7, 2022, 1:04 PM IST

  • 'ముందు దేశం.. తరువాతే కుటుంబం'

Bandi sanjay on micro donations: బ్లాక్ మెయిల్ చేసి అవినీతికి పాల్పడి నిధులు సేకరించాల్సిన అవసరం భాజపాకు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సవాళ్లను అధిగమించడమే భాజపా కార్యకర్తల నైజమని తెలిపారు. జాతీయ స్థాయిలో మైక్రో డొనేషన్స్​పై జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • సిద్దిపేట దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు..

Siddipet Robbery Case Accused Arrest : సిద్దిపేటలో గత నెల 31న జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఓ కారు డ్రైవర్​పై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.42 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ దోపిడీకి సంబంధించిన నలుగురిలో ఇద్దరిని అరెస్టు చేశారు.

  • రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్​

AP CM JAGAN HYDERABAD TOUR : సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నేడు హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 3.50కి గన్నవరం నుంచి బయలుదేరి... సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

  • కశ్మీరీ అందాలు కలగలిసిన 'ఇగ్లూ కేఫ్'​..

IGLOO CAFE: జమ్మూకశ్మీర్‌లోని ఓ ఇగ్లూ కేఫ్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. చక్కని ఆతిథ్యం, కశ్మీరీ అందాలు కలగలసి పర్యటకులను కట్టిపడేస్తోంది. స్నోగ్లూ పేరిట ఏర్పాటైన ఈ ఇగ్లూ కేఫ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌గా నిర్వాహకులు చెబుతున్నారు.

  • రూ.900 కోసం కన్నతండ్రినేే కడతేర్చిన కుమారుడు

son killed father: రూ.900 అడిగితే ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రినే చిదకబాది హతమార్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.

  • 'మంచి రోజులు ఎవరికి?'.. కేంద్రంపై రాహుల్​ ఫైర్!

RAHUL FIRES ON CENTRE: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని సూచిస్తూ కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. దేశంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • 'ఉక్రెయిన్​పై రష్యా ఏ రోజైనా దాడి చేయొచ్చు'

Ukraine Tension: ఉక్రెయిన్​పై రష్యా ఏ రోజైనా దాడి చేయవచ్చని అమెరికా పేర్కొంది. ఫలితంగా ఉక్రెయిన్​లో భారీగా ప్రాణనష్టం జరగవచ్చని శ్వేతసౌధం జాతీయ భద్రత సలహాదారు జాక్​ సల్లీవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?

  • అమ్మకానికి టీ20 ప్రపంచకప్​ టికెట్లు

T20 World Cup Tickets: టీ20 ప్రపంచకప్​నకు రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మెగా ఈవెంట్​​ టికెట్లు అమ్మకానికి ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తెలిపింది. ఈ టికెట్​ ధరలను పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు పేర్కొంది. t20worldcup.com వైబ్​సైట్​లో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

  • ''రాధేశ్యామ్'.. నన్ను డిఫరెంట్​ మూడ్​లోకి తీసుకెళ్లింది'

Radhe shyam thaman: 'రాధేశ్యామ్' బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అద్భుతంగా వచ్చిందని తమన్ చెప్పారు. ఈ సినిమా తనను డిఫరెంట్​ మూడ్​లోకి తీసుకెళ్లిందని అన్నారు. వింటేజ్​ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details