తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Feb 7, 2022, 7:04 AM IST

  • నేడు యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు.

  • 'కరోనా మళ్లీ విరుచుకుపడొచ్చు.. ఇదే కారణం!'

Corona Third Wave : కొవిడ్​ వ్యాప్తి అప్పుడే తగ్గినట్లు భావించొద్దని... దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరించారు. మళ్లీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టడానికి వైరస్‌ మ్యుటేషన్లు కారణమని ఆమె తెలిపారు. కొవిడ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించి ప్రపంచానికి తెలియజెప్పిన డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ.. ‘'ఈనాడు- ఈటీవీ భారత్​’'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.

  • శోభాయమానంగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

Ramanuja Sahasrabdi Utsav: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమీపంలోని శ్రీరామనగరం సమతామూర్తి కేంద్రం జనసంద్రమైంది. రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది నుంచి భక్తులు, సందర్శకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

  • రుణం అందడం లేదు... "సాగు" సాగడంలేదు..

Delay in agricultural loans : ఘనమైన లక్ష్యాలు.. భారీ ప్రణాళికలు.. ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది రాష్ట్రంలో పంట రుణాల పరిస్థితి. వ్యవసాయం ప్రధానంగా ఉన్న రాష్ట్రంలో బ్యాంకుల నుంచి అన్నదాతకు అందుతున్న తోడ్పాటు పరిమితంగానే ఉంటోంది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు చిన్న సన్నకారు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు లక్ష్యం చేరుకోవడం లేదు.

  • 'కొందరికి కలలో కృష్ణుడు అందుకే కనిపిస్తున్నాడు'!

UP Elections 2022: ఉత్తరప్రదేశ్​లో గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఆదివారం నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

  • రైలు పట్టాలపై సెల్ఫీలు- ఇద్దరు దుర్మరణం

Selfie Train Deaths: మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

  • రష్యాలో రికార్డు స్థాయి కరోనా కేసులు- 10 రెట్లు అధికం!

Russia Corona Cases: రష్యాలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చితే ప్రస్తుతం కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. జనవరిలో 17,000 నమోదైన కేసులు.. ఆదివారం 1,89,071కి పెరిగాయి.

  • ఐపీవోలో పాల్గొనాలంటే ఏం చేయాలి?

LIC IPO 2022: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వరలో ఐపీవోకు రానున్న నేపథ్యంలో ఈ సంస్థ పాలసీదారులు కూడా ఇందులో పాల్గొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాలసీదారుల్లో కూడా ఈ ఐపీవోలో పాల్గొనాలన్న ఉత్సుకత నెలకొంది. మరి ఐపీవోలో పాల్గొనాలంటే ఏమేం కావాలి..?

  • అండర్-19 కుర్రాళ్లు.. భవిష్యత్​ తారలు

నూనూగు మీసాల కుర్రాళ్లు.. వాళ్లవి వేర్వేరు ప్రాంతాలు.. విభిన్న నేపథ్యాలు. కథలు వేరైనా.. వాళ్ల కల మాత్రం ఒకటే. అందు కోసం ఒకటిగా కలిశారు. ఒక్కో సవాలును దాటుకుంటూ సమష్టిగా ముందుకు సాగారు. చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. వాళ్లే.. భారత అండర్‌-19 కుర్రాళ్లు. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌ అందుకున్న ఛాంపియన్లు.

  • 'లైగర్​' కొత్త అప్​డేట్.. త్వరలో 'పూరీ' కలల ప్రాజెక్ట్​ షురూ!

Puri Jagannadh News: దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఆసక్తికర అప్​డేట్​ ఇచ్చారు. విజయ దేవరకొండ కథనాయకుడిగా తెరకెక్కిస్తున్న లైగర్​ పూర్తయిందని.. ఇక తదుపరి చిత్రం 'జనగణమన'ను త్వరలో పట్టాలు ఎక్కించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details