తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్

By

Published : Feb 5, 2022, 1:02 PM IST

  • 'హైదరాబాద్​లో పర్యటించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..'

PM Modi Hyderabad Tour: నేడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్​లో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ.. ట్వీట్​ చేశారు. ఇక్రిశాట్​ స్వర్ణోత్సవాలతో పాటు.. రామానుజాచార్య సహస్తాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

  • 'జ్వరం, నీరసంగా ఉంటే ఆర్​ఎంపీ వద్దకు వెళ్లండి.. ఇక్కడికి రావొద్దు'

ఎవరికి ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా వెంటనే ఆసుపత్రి గుర్తుకు వస్తుంది. డబ్బు ఉన్న వాళ్లైతే ప్రైవేటు ఆసుపత్రి వైపు వెళ్తారు. లేని వారు ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీస్తారు. కానీ.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం జ్వరం, దగ్గు, నీరసంగా ఉంటే మీకు దగ్గర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకైనా.. స్థానిక క్లినిక్‌కైనా వెళ్లండని అంటున్నారు.

  • 'డ్రైనేజీ నిర్మాణం పేరుతో... ఇళ్లను కూలుస్తున్నారు'

Houses Dismasted: డ్రైనేజీ నిర్మాణం చేస్తామని చెప్పి.. ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్​ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను మున్సిపల్ అధికారులు దగ్గరుండి.. కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు.

  • 'మీ వల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్‌కే ప్రమాదం'

Posoco Letter to AP : 'మీవల్ల జాతీయ గ్రిడ్‌కే ప్రమాదం.. పరిమితికి మించి విద్యుత్‌ తీసుకుంటున్నారు' అంటూ ఏపీ విద్యుత్‌ సంస్థలకు పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లేఖ రాసింది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో హెచ్చరించింది.

  • మాజీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Janga Reddy Passed Away : భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర భాజపా నేతలు సంతాపం ప్రకటించారు. జన్​సంఘ్, భాజపాను విజయ శిఖరాలకు చేర్చే ప్రయత్నంలో జంగారెడ్డి తన వంతు కృషి చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. జంగారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • 155కిలోల బరువున్న గర్భిణీకి విజయవంతంగా శస్త్ర చికిత్స

155 కిలోల బరువున్న గర్భిణీకి సురక్షితంగా శస్త్రచికిత్స చేసి తల్లిబిడ్డలకు కాపాడిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగింది. పట్టణంలోని ఘతి ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు.

  • డ్రగ్స్ స్మగ్లింగ్.. 110 మంది అరెస్ట్​

డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. తాజాగా కొరియర్​ పార్సిళ్ల రూపంలో డ్రగ్స్​ను సరఫరా చేస్తున్న ఘటనలు కేరళలో వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి అరెస్టులు చేస్తున్నారు.

  • కోహ్లీతో మాట్లాడాక ఆత్మవిశ్వాసం పెరిగింది: అండర్​-19 కెప్టెన్​

Under-19 Yash Dhull about kohli: అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​కు ముందు టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీతో మాట్లాడటం తమకు ధైర్యానిచ్చిందని అన్నాడు కుర్రాళ్ల జట్టు కెప్టెన్​ యశ్​ ధుల్​. ఫైనల్​లో ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలా ఆడాలనే విషయాలపై విరాట్​ సూచనలు చేసినట్లు తెలిపాడు.

  • భారత సంతతి కుర్రాడు అదరహో.. అఫ్గాన్​పై ఆసీస్​ విజయం

Under-19 Worldcup Australia Vs Afghanisthan: అండర్​-19 వరల్డ్​కప్​లో భాగంగా మూడో స్థానం కోసం నేడు జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై ఆస్ట్రేలియా గెలుపొందింది. రెండు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. కాగా, భారత సంతతి కుర్రాడు వేథన్​ రాధాకృష్ణన్​ను 'ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్'​ అవార్డు వరించింది.

  • బీచ్​లో పూజా బెనర్జీ.. అందాలతో కిక్​ ఇస్తూ..

ఇటీవలే బీచ్​ దగ్గర హొయలతో సందడి చేసింది బంగాలీ నటి పూజా బెనర్జీ. ఆమె విశేషాలతో పాటు ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. ఈమెను పూజా బోస్​ గానూ పిలుస్తారు.

ABOUT THE AUTHOR

...view details