తెలంగాణ

telangana

ETV Bharat / state

Top Ten News: టాప్​టెన్​ న్యూస్ @9AM - top news in TS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News
Top Ten News

By

Published : Feb 2, 2022, 9:00 AM IST

  • నిరాశపరచిన నిర్మలమ్మ పద్దు

కొవిడ్‌ దెబ్బల ధాటికి జీవితాలు దుర్భరమైన దుస్థితిలో బడ్జెట్‌లో ఊరట కల్పిస్తారని సామాన్య భారతం వేయికళ్లతో ఎదురుచూసింది. సమ్మిళిత వృద్ధికి కేంద్రం కంకణ బద్ధమైందంటూ అధికార వర్గమూ అందుకు తగినట్లుగానే ఊరించింది. వాస్తవ బడ్జెట్‌ రూపకల్పనలో ఆ అంచనాలు దెబ్బతిన్నాయి.

  • వ్యాపిస్తున్న ఒమిక్రాన్​ ఉప వేరియంట్​

ఒమిక్రాన్​ ఉప వేరియంట్​- బీఏ2 వ్యాప్తి తీవ్రంగా ఉందని డెన్మార్​ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్​ వ్యాప్తి రేటు ఏకంగా 39 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.

  • ఈసారి బుల్లెట్టు బండి లేనట్టే!

కేంద్రబడ్జెట్​లో ద.మ.రైల్వేకి నిధుల కేటాయింపుల వెల్లడి రెండ్రోజుల్లో ఉండనుంది. రైల్వేశాఖకు గతంలో కంటే అధికంగా నిధులు కేటాయించినప్పటికీ... తెలంగాణకు కొత్తగా భారీ రైల్వే ప్రాజెక్టులు దక్కే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • డ్రగ్స్‌ వాడే వారిపై నజర్‌

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్​ నిరోధంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడానికి పోలీసు అధికార యంత్రాంగం నడుం బిగించింది. తరచూ దాడులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారితోపాటు వినియోగిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

  • మణిపురంలో.. భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరీ

మణిపుర్​లో రాజకీయ వేడెక్కుతున్నాయి. ఐదేళ్ల కిందట అనూహ్య రీతిలో అధికారం కోల్పోయిన హస్తం పార్టీ ఈసారి మాత్రం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. మరో వైపు భాజపా కూడా అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. నాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీలు కూడా నేడు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ బలాబలాను ఓ సారి చూద్దాం.

  • అక్కాచెల్లెళ్లపై ఏడాదిగా అత్యాచారం

Gang rape: మైనర్​ అక్కాచెల్లెళ్లపై ముగ్గురు దుండగులు ఏడాదిగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన రాజస్థాన్​​లో వెలుగు చూసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తండ్రిని చంపేస్తామని బాధితురాళ్లను బెదిరించారు.

  • అధికారంలోకి వస్తే.. 'డబుల్​ రేషన్​' ఫ్రీ

యూపీలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతినెలా ఉచితంగా డబుల్​ రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

  • బరువును అదుపులో ఉంచుకోండిలా..!

అందరి దృష్టి ఇప్పుడు బరువు, ఆకారాల మీదే. ప్రపంచంలో ఎక్కడైనా వీటి విషయంలో తృప్తి పడనివారే ఎక్కువ. సన్నగా ఉండేవారికి బరువు పెరగాలనే కోరిక. లావుగా ఉండేవారికి తగ్గాలనే ఆశ. అధిక బరువు శరీరాకృతినే కాదు, ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. మరి దీన్ని అదుపులో ఉంచుకోవటమెలా?

  • సానియా కీలక నిర్ణయం!

ఇటీవలే రిటైర్మెంట్​ నిర్ణయం ప్రకటించి అభిమానులను షాక్​కు గురి చేసిన భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా.. వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పింది. కోచ్‌ లేదా వ్యాఖ్యాతగా అయ్యే అవకాశాలున్నాయి తెలిపింది.

  • 'వలిమై' రిలీజ్​ డేట్!​

తమిళ సూపర్​స్టార్​ అజిత్​ కుమార్​ నటించిన 'వలిమై' రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన బాలీవుడ్​ భామ అలియా కొత్త సినిమా షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది.

ABOUT THE AUTHOR

...view details