- రద్దీగా చేపల మార్కెట్లు
మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో భౌతిక దూరం సైతం కొనుగోలుదారులు పాటించడం లేదు. హైదరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్ కిటకిటలాడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లక్ష దిగువకు కేసులు
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 86,498 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. 66 రోజుల కనిష్ఠానికి కేసులు నమోవటం ఇదే తొలిసారి. వైరస్ బారినపడి మరో 2123 మంది మరణించారు. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పేగులపైనా కరోనా ప్రభావం
మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్ పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటంతో రక్తసరఫరా నిలిచిపోయి... కొందరిలో పేగులూ దెబ్బతింటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడో దశలో హైబ్రిడ్ వేరియంట్
కొవిడ్ మూడోదశపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని... ఏడాదిన్నరగా పరిశోధన చేస్తున్న నిట్ ఆచార్యులు హెచ్చరిస్తున్నారు. ఊసరవెల్లి తరహాలో వైరస్ మార్పులకు గురవుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడమే... సమస్యకు పరిష్కారమని సూచిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రధాని మోదీకి జగన్ లేఖ
ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పీఎంఏవై కింద గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పనపై లేఖలో ప్రస్తావించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నడుస్తున్న బైకులో మంటలు