గాంధీలో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. హాస్పిటల్‌లో.. కొవిడ్ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి.. వైద్యులతో సమీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టెండర్లకు ఆహ్వానం
కొవిడ్ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు కోటి డోసుల కరోనా టీకాల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. నెలకు కనీసం 15 లక్షల చొప్పున 6 నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధన విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్లాక్ మార్కెట్కు తరలనివ్వం..
రాష్ట్రంలో ఆక్సిజన్.. బ్లాక్ మార్కెట్కు తరలకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సిలిండర్లు సరఫరా చేసే డీలర్లపై నిఘా పెంచింది. ఆరు ప్రభుత్వ శాఖలతో వంద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. ఆక్సిజన్ సరఫరా విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆర్టీసీ అద్దె కష్టాలు..
ఆర్టీసీతో.. అద్దె బస్సుల నిర్వాహకులు అనేక అవస్థలు పడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌తో సుమారు ఏడు నెలలపాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాజా లాక్‌డౌన్‌తో వారం రోజుల నుంచి బస్సులు షెడ్డుల్లోనే ఉంటున్నాయి. ఓ వైపు బస్సులు నడవక మరో వైపు వాటికి రావాల్సిన బకాయిలు రాక.. నిర్వాహకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎన్ 95ను ఉతకొచ్చా?
ఒక ఎన్95 మాస్కును ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.