ఇంటింటి సర్వేలో నిజాలు
నల్గొండ జిల్లాలో గత వారం రోజుల్లో కొవిడ్ కేసులు 1,875. ఈ సమయంలో ఇదే జిల్లాలో ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించిన వారు 9,433 మంది. అధికారికంగా ప్రకటించిన కేసుల కంటే లక్షణాలున్న వారు దాదాపు అయిదింతలు ఎక్కువన్నమాట. రాష్ట్రంలో కొవిడ్ లక్షణాలతో ప్రజలు పెద్దఎత్తున బాధపడుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మధ్యాహ్నం నుంచి గప్‌చుప్
బుధవారం తెల్లవారుతూనే జనం హడావిడిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొందరు కూరగాయల మార్కెట్లకు, మరికొందరు నిత్యావసర వస్తువుల కోసం.. ఇంకొందరు సొంతూళ్లకు.. గడియారాల్లో, ఫోన్లలో సమయం చూసుకుంటూ.. ఎవరి తొందరి వారిదే.. ఎవరి అవసరాలు వారివే.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. నాలుగు గంటల పాటు ఉరుకులూ పరుగులూ.. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈ-పాస్ ఇక్కట్లు
లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు జారీ చేస్తామంటూ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే మార్గదర్శకాలు, నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆసుపత్రులు తక్షణావసరం
కరోనా రెండో దశ ఏర్పడ్డ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో తాత్కాలిక ఆసుపత్రుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి కృషి చేస్తున్నాయి. కేంద్రం ఈ ఆసుపత్రుల ఏర్పాట్లను ముమ్మరం చేసి.. వైద్య విద్యార్థుల సహాయంతో ఆసుపత్రులను నిర్వహించాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నలుగురు దుర్మరణం
లారీ-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.