తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్
టాప్​టెన్​ న్యూస్

By

Published : Apr 12, 2021, 6:59 PM IST

1. నిధులు విడుదల

కొలువులు పోయి రోడ్డున పడ్డ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.32 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఇదే చివరి హెచ్చరిక

వరంగల్​ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​... భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్​... ఇదే చివరి హెచ్చరిక అని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఈసారి నిరాడంబరంగానే..

కరోనా వైరస్ రెండో దశలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఉగాది వేడుకలను నిరాడంబరంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పండుగను ప్రభుత్వం తరపున హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వానొచ్చినా..!

దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే.. ఈ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. లోయలో పడిన బస్సు

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దోడా నుంచి కహారాకు వెళుతున్న మినీ బస్సు లోయలో పడిపోయింది. దోడా జిల్లా కేంద్రానికి 42కిమీ దూరంలోని పియాకుల్ గ్రామం వద్ద గల థాత్రి-గండో లోయలో ఈ బస్సు పడిపోయినట్లు దోడా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కొవిడ్​ వాప్తిపై తీవ్ర హెచ్చరిక

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణం ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడమేనని అన్నారు ఎయిమ్స్​ డైరెక్టర్ డా.రణ్​దీప్ గులేరియా. సార్స్​ కోవ్​-2 వేగంగా సంక్రమించడమూ కారణంగా చెప్పారు. అయితే వైరస్​ను తేలిగ్గా తీసుకోరాదని, జాగ్రత్తలు పాటిస్తూ టీకా వేయించుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'వారిపై రాజకీయ నిషేధమే సరి!'

కూచ్​బెహార్​ కాల్పుల తరహా ఘటనలు.. రాష్ట్రంలో మరిన్ని జరుగుతాయని వ్యాఖ్యానించిన నేతలను రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. భాజాపాను దేశంలో లేకుండా చేయటం ఒక్కటే ఇక తాను చేయాల్సిన పనుల్లో మిగిలి ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాక్​డౌన్​ వద్దు

మరోసారి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశాయి. లాక్​డౌన్ బదులు సిబ్బంది సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు సాగించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని కోరాయి. భారత పరిశ్రమల సమాఖ్య చేసిన సర్వేలో... మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

9. ఆ మ్యాచ్​ గుర్తుందా..!

216.. ఐపీఎల్‌లో అప్పటి వరకు అత్యధిక చేధన ఇదే. అలాంటింది 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తారని ఎవరైనా అనుకుంటారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. గెలుపోటములను పక్కన పెడితే ఆనాడు షార్జా సిక్సర్ల జడివానకు తడిచి ముద్దైంది. ప్రస్తుత సీజన్​లో ఆ రెండు జట్లు తలపడుతున్న నేపథ్యంలో2020లో ఏం జరిగిందో 'రివైండ్‌' చేసుకుందామా?

10. సర్కారు నిర్ణయంపై మంచు విష్ణు హ్యాపీ

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ఇటీవల తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నటుడు మంచు విష్ణు ప్రశంసించారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది అధ్యాపకులు సంతోషిస్తున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details