తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till now
టాప్ 10 న్యూస్ @3PM

By

Published : Jun 5, 2020, 3:03 PM IST

అతని మృతికి ఆధారాలున్నాయ్..!

హైదరాబాద్​ వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ కరోనాతో మృతిచెందాడని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త ఆచూకీ తెలపాలంటూ మధుసూదన్‌.. భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రభుత్వం ఏం నివేదించింది అంటే?

'వారిని రెగ్యులర్‌గా పరిగణిస్తారా?'

పదో తరగతి పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ రోజు ఏం ప్రశ్నించిందంటే?

వజ్రాల వేట మొదలైంది!

రాళ్లసీమలో రతనాల వేట మొదలైంది. తొలకరి జల్లులు పలకరించటం వల్ల పొలాలపై ప్రజలు దండెత్తుతున్నారు. ఒక్క వజ్రమైనా దొరుకుతుందన్న ఆశతో రోజంతా వెతుకుతున్నారు. వారి అన్వేషణ ఫలిస్తుందా?

ఏరువాక పౌర్ణమి వేడుకలు

ఖరీఫ్ సీజన్ ప్రారంభ సూచికగా... ఏరువాక పౌర్ణమిని సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు(ఎస్)మండల కేంద్రంలో ఈ వేడుకలను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏం చేశారంటే..

షాపింగ్​మాల్స్​ తెరిచినా..

జూన్ 8 నుంచి షాపింగ్​ మాల్స్ తెరవడానికి కేంద్రం అనుమతించిన తరుణంలో తాజాగా దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఏంటంటే?

చలానా​ కట్టమంటే పోలీసులనే కొట్టాడు!

ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. కరోనా అంటే భయంలేకుండా, ముఖానికి మాస్క్​ లేకుండా రోడ్లపై తిరిగాడు. చలానా​ కట్టమన్నందుకు పోలీసులపైనే తిరగబడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

50 తులాల బంగారం చోరీ

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా రాఘవేంద్ర హిల్స్​ కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ. 95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఏం జరిగిందంటే?

ఎయిర్​టెల్ క్లారిటీ

తమ కంపెనీలో అమెజాన్ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది ఎయిర్​టెల్​. ఆ వార్తలు నిరాధారమైనవని స్పష్టతనిచ్చింది. ఇంకేమన్నదంటే?

ఐపీఎల్-2020​ జరిగితే..?

కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్​ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో టోర్నీ ఉంటుందా? రద్దవుతుందా? స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తారా? ఒక వేళ నిర్వహిస్తే..?

ఆ సినిమా వారిద్దరూ చేయాల్సింది...

ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్​ సెల్వన్​'. ఈ చిత్రంలో రెండు పాత్రలకు మహేశ్​ బాబు, విజయ్​ దళపతిని సంప్రదించారని మణిరత్నం శిష్యుడు ధన శేఖరన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details