జలసౌధలో సమావేశం
హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో గోదావరి నది బోర్డు భేటీ అయింది. ఈఎన్‌సీ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, టెలిమెట్రీ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
సీఎస్ కాన్వాయ్ అడ్డగింత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులకు పరిశీలించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. సదాశివనగర్ మండలంలోని తిర్మన్‌పల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం సీఎస్ గర్గుల్ గ్రామానికి వెళ్తుండగా ఓ రైతు సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్నాడు.ఎందుకు అడ్డుకున్నాడంటే..?
50 తులాల బంగారం చోరీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాఘవేంద్ర హిల్స్ కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఏం జరిగిందంటే...
హైకోర్టు సమ్మతించింది
ఆసుపత్రి నుంచి డిశ్చార్జికి విశాఖ వైద్యుడు సుధాకర్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఆయన ఎప్పుడైనా వెళ్లొచ్చని సూచించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది. ఇంకేమన్నదంటే...
తిరుమలలో జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. నేడు ఏమి చేశారంటే?