తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @11AM - ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​ 10 న్యూస్ @11AM

By

Published : Jun 5, 2020, 11:03 AM IST

తొమ్మిది మంది దుర్మరణం

ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా రికార్డ్​

లాక్​డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 9,851 కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య ఎంతంటే..

బోర్డు మీటింగ్​

ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్​లో సమావేశం కానుంది. దీనిలో చర్చించే అంశాలు

ఇంట్లోనే కరోనా చికిత్స

కరోనా లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? వైద్యుల సలహాలతో ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ..? ఆసుపత్రికి వెళ్లకుండా ఇవన్నీ మీరు ఇంట్లో నుంచే చికిత్స పొందుతూ వైరస్​ నుంచి బయటపడొచ్చు. అది ఎలాగంటే...

అమ్మో ఆన్​లైన్ చదువులు..

అప్పులు చేసైనా వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పిల్లల్ని చదివిస్తున్న లక్షలాది మంది తల్లిదండ్రులపై ఈ ఏడాది మరింత ఆర్థిక భారం పడుతోంది. ఆన్​లైన్​ బోధన కోసం ఒక్కో కుటుంబం రూ. 20 వేల వరకూ అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై నిపుణలు ఏమంటున్నారంటే...

మూడేళ్ల బాబును ఎలా చంపాడంటే..?

వరంగల్​ రూరల్​ జిల్లా గొర్రెకుంట బావి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్​ మూడేళ్ల చిన్నారిని కనికరం లేకుండా బావిలో పడేసి హతమార్చినట్లు ఒప్పకున్నాడు. ఆ రోజు ఏం చేశాడంటే..?

చూస్తుండగానే సముద్ర గర్భంలోకి!

నార్వే ఆర్కిటిక్ ప్రాంతం ఆల్టా పట్టణంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. చూస్తుండగానే దాదాపు 8 ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. లైవ్​ వీడియో కోసం...

జియోలో మరో విదేశీ పెట్టుబడి

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. అబుదాబికి చెందిన ముబ్దాలా ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ జియోలో రూ.9,093.60 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్​ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటికి జియో ఎన్ని ఒప్పందాలు చేసుకుందంటే...

అభిమానుల మధ్యే టీ20 లీగ్​

ఆస్ట్రేలియాలో క్రీడల పునః ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా స్తంభించిన క్రికెట్​కు టీ20 లీగ్​తో స్వాగతం పలుకుతోంది. లీగ్ ఎప్పుడంటే...

నవ్వించడం వస్తే చాలు..

టాలీవుడ్​లో ఈ నటి చేసింది ఆరు సినిమాలే కానీ వాటితోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందం, అభినయం సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సురభి పురానిక్​.. నేడు పుట్టినరోజు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. ఏమన్నదంటే.

ABOUT THE AUTHOR

...view details