ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురష్యా ద్విముఖ వ్యూహం రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. యుద్ధం వస్తుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. రష్యా మాత్రం దౌత్య మార్గాల్ని అనుసరిస్తూనే.. ఉక్రెయిన్ సరిహద్దులో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. అటు చర్చలకు సై అంటూనే.. సైనిక మోహరింపులకు దిగి దాడి జరిపే అవకాశముందని తెలుస్తోంది. అసలేం జరుగుతుంది? ఏం జరగనుంది? యుద్ధమా? దౌత్య మార్గంలో పరిష్కారమా..?విజయం పక్కా మాదేఉత్తర్ప్రదేశ్లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) సహా పలు చిన్న పార్టీలతో కలిసి ఆయన ఏర్పాటుచేసిన కూటమికి ప్రచారపర్వంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది.సైబర్ క్రైం టోల్‌ఫ్రీం cybercrime Toll free number 1930: సైబర్ నేరాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్రహోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్ మారింది. 155260గా ఉన్న నంబరు ఇకపై 1930గా కొనసాగనుంది.ప్రాణం వదిలిన ‘ప్రేమ’ఖైదీప్రేమలేని ఈ లోకంలో నేనుండలేనంటూ ‘ప్రేమికుల దినోత్సవం’ రోజునే రిమాండ్ ఖైదీగా ఉన్న యువకుడు తనువు చాలించిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.వాహన్‌లో చేరిన తెలంగాణ వాహనాల దొంగతనం జరిగినా.. విధ్వంసకర సంఘటనల్లో వాటిని ఉపయోగించినా.. ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి ఒకే దేశం.. ఒకే కార్డు నినాదంతో కేంద్రం వాహన్ (వాహనాల రిజిస్ట్రేషన్) పోర్టల్‌ను 2019లో అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణఆదాయం పెంచుకునే మార్గాలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవలే ఆస్తుల మార్కెట్ విలువలు పెంచిన సర్కార్.. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం మరోమారు దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగిస్తున్న ప్రభుత్వం.. గనుల లీజు, ఇసుక రీచుల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా గనుల శాఖలో త్వరలో సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.మూడు కోట్లకుపైగా ప్రాణాలు సేఫ్ సీరమ్ సంస్థ ఉత్పత్తి చేసిన టీకాలతో ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మందికిపైగా ప్రజల ప్రాణాలు కాపాడామని అన్నారు ఆ సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా. 170కి పైగా దేశాల్లో పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఎస్‌ఐఐ వ్యాక్సిన్లు ఉపయోగపడ్డాయని చెప్పారు.ప్లంబర్ టు పేస్ బౌలర్కష్టేఫలి అనేది పెద్దలు చెప్పే నానుడి. ఒడిశాకు చెందిన యువకుడు ఈ నానుడిని నిజం చేశాడు. మనోబలంతో పనిచేస్తే సాధించలేనిదేది ఏదీ లేదని చాటిచెప్పాడు. నిరంతర శ్రమతో విజయాన్ని సొంతం చేసుకొని తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.మాక్స్‌వెల్ వెడ్డింగ్ కార్డు వైరల్ Glenn Maxwell Card Goes Viral: ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రస్తుతం అతడి వెడ్డింగ్ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.ఆ నటుడితో హీరోయిన్ సహజీవనం'సాహసం శ్వాసగా సాగిపో'తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది మంజిమా మోహన్. ప్రస్తుతం ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓ యువ హీరోతో సహజీవనంలో ఉన్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.