బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏపీలోని విశాఖ ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకుల బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కోటికి చేరటమే లక్ష్యం
రెండు ఎన్నికల్లో గెలిస్తేనే... కొందరు ఎగిరెగిరి పడుతున్నారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనాన్ని అసమర్థతగా తీసుకోవద్దంటూ ఘాటుగా స్పందించారు. సిరిసిల్లలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వీడని చిక్కుముడి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో బీఫార్మసీ యువతి అపహరణ కేసు చిక్కుముడి వీడటం లేదు. తనపై అత్యాచారం జరిగిందని యువతి తప్పుదారి పట్టించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నీటి విడుదలకు బోర్డు ఉత్తర్వులు..
రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
11 మంది మృతి
తమిళనాడు విరుధానగర్జిల్లా అచ్చంకుళం గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగి 11 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పది అగ్నిమాపక యంత్రాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.