సీఎం సమీక్ష
రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం... వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
స్పష్టత వచ్చేనా?
రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఈనెల 18 లేదా 20న ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నరికి చంపేశారు
సమయం దాదాపు రాత్రి 11 దాటింది. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న వారితో ఆ రోడ్డు కొంచెం రద్దీగానే ఉంది. అదే సమయంలో ఓ యువకుడిని తరుముకుంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వాహనంతో తొక్కించి
పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువు వారిని తన వాహనంతో ఢీకొట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నేడు తీర్పు
ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. దీనితో పాటు అఖిలప్రియను ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌పైన కూడా నేడు తీర్పు వెలువరించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.