పట్టపగలే
హైదరాబాద్‌లో పట్టపగలే దర్జాగా ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. డబ్బులు నింపుతున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కూర్చున్నచోటే
ఒంట్లో నలతగా ఉంది... కరోనా వచ్చిందేమోనని పరీక్షకు వెళ్లాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఫలితం చూసి పూర్తిగా నీరసపడిపోయిన ఆ బాధితుడు... ఆస్పత్రి మెట్లపైనే కూర్చుండి పోయాడు. అసలే అనారోగ్యంతో ఒంట్లో సత్తువ లేదు... దానికి తోడు కరోనా అని తేలటంతో మనోధైర్యం కోల్పోయిన నర్సింహా కూర్చున్నచోటే తుదిశ్వాస విడిచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సమాచారం ఇస్తే తప్పేంటి
కరోనా కట్టడిలో భాగంగా విధించిన రాత్రి కర్ఫ్యూ... రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆరాతీసింది. ప్రభుత్వ నిర్ణయం రేపు చెబుతామని తెలపగా... హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజలకు ఒక రోజు ముందు సమాచారమిస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పోలీసుల స్టెప్పులు
కరోనా వేళ.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. కరోనా 2.0పై ప్రజలను అప్రమత్తం చేస్తూ.. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం ప్రాధాన్యత తెలియజేసేలా ఈ వీడియోను రూపొందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వారిలో కరోనా ముప్పు ఎక్కువే!
మొదటి సారి కరోనా బారిన పడి కోలుకున్న యువకులకు సైతం మళ్లీ వైరస్ సోకే అవకాశం లేకపోలేదని అమెరికాకు చెందిన లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. అమెరికా నావీ ఉద్యోగులలో 2,247మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.