తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 7pm
టాప్​టెన్​ న్యూస్​@ 7PM

By

Published : Dec 31, 2020, 6:59 PM IST

నివేదిక సమర్పించిన పీఆర్‌సీ కమిటీ

ప్రభుత్వానికి తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికను అందించింది. 2018 మే లో సీఆర్‌ బిస్వాల్ నేతృత్వంలో మహ్మద్ రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు సభ్యులుగా పీఆర్‌సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దర్యాప్తు ముమ్మరం

దా'రుణ' యాప్‌ల కేసును సైబర్‌ క్రైం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక సూత్రదారి చైనాకు చెందిన ఝ.. వి.. ల్యాంబో అరెస్టు కావటంతో..రుణాలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తొలి మహిళా సీజే

హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్​ జారీచేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నిఘా

కొత్త సంవత్సరం వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ ముందస్తు అంచనా వేసింది. మాదకద్రవ్యాల సరఫరాను నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

షాకిచ్చిన కోతి

కోతిని తరమబోయి ఓ వ్యక్తి విద్యుత్ షాక్​కు గురైన ఘటన కూకట్​పల్లిలో చోటుచేసుకుంది. కోతుల బెడద ఎక్కువుందని ఇనుప రాడ్​తో తరిమేందుకు యత్నించగా... రాడ్​ విద్యుత్ తీగలకు గురై అశోక్ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రాహుల్​ ధ్వజం

పేదల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేయడాన్ని తప్పుపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఈపీఎఫ్​ వడ్డీ జమ

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై నిర్ణయించిన 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చాలా బాగుంది

కోహ్లీ, స్మిత్​లను దాటుకుని టెస్టు ర్యాంకింగ్​లో అగ్రస్థానానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని న్యూజిలాండ్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ అన్నాడు. జట్టు కోసం ఆడినప్పుడు తమకు ఇలాంటి గౌరవం లభిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఫలితం గోరంత!

ఈ ఏడాది ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు హిట్ టాక్​ను తెచ్చుకోగా.. మరికొన్ని సినిమాలు మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. అటు థియేటర్​తో పాటు ఓటీటీ ద్వారా విడుదలైన కొన్ని చిత్రాలు సగటు అభిమానిని మెప్పించలేకపోయాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details