తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM

By

Published : Jan 19, 2021, 4:58 PM IST

1.అందరికీ కాదు

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది కోసం మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్టు... వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియను రెండు వారాల్లోపే పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.ఆణిముత్యాలు

"ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ చదవడం ఖర్చుతో కూడుకున్న విషయం. డబ్బున్న వారే మెడిసిన్ చదవగలరు" అన్న ఆలోచనను మార్చేశారు ఆ ఐదుగురు విద్యార్థులు. చిన్నప్పటి నుంచి గురుకులాల్లోనే చదివి మెడిసిన్​ పరీక్షలో మెరిశారు ఆ ఆణిముత్యాలు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.బియ్యం గింజపై..

హైదరాబాద్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు రాచకొండ రాజు.. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ పేరును బంగారు బియ్యం గింజపై రాశారు. మంత్రుల అధికారిక నివాసంలో దీనిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.సంకల్పం

అసలే పేదరికం. నిలువ నీడలేదు. భర్తకు సరైన ఉపాధి లేదు. అప్పు చేసి పెట్టుకున్న మెకానిక్ షెడ్డే ఆ కుటుంబానికి బతుకుదెరువు. భర్త కష్టాన్ని చూసిన ఆ ఇల్లాలు రెంచి పట్టింది. భర్తకు సాయం చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.మార్పు ఉండదు

జేఈఈ, నీట్​ 2021 పరీక్షల సిలబస్​లో మార్పులు ఉండవని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అలాగే.. ఎన్​ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల ప్రవేశ నిబంధనల్లో పలు సడలింపులు చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.నిష్పక్షపాతంగా చర్చలు!

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి చర్చలు చేపడతారని స్పష్టం చేశారు వారిలో ఒకరైన అనిల్​ ఘన్వత్​. రైతులతో తొలి విడత చర్చలు ఈనెల 21న జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.రాజుగారిని అవమానిస్తావా.

థాయ్​లాండ్​ రాచరిక వ్యవస్థను, మహారాజును అవమానించినందుకు ఓ మాజీ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి 43 ఏళ్ల జైలు శిక్ష పడింది. మొదట 87 ఏళ్ల శిక్ష విధించిన న్యాయస్థానం.. నిందితురాలు తప్పు ఒప్పుకున్నందున శిక్షను సగానికి తగ్గించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.14,500 పైకి నిఫ్టీ

వరుసగా రెండు సెషన్ల నష్టాల నుంచి తేరుకుని.. మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ భారీగా 834 పాయింట్లు బలపడి 49,398 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240 పాయంట్ల లాభంతో 14,521 వద్దకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.విజయమే సమాధానం

తొలిటెస్టు ఓటమి తర్వాత సిరీస్​ను టీమ్​ఇండియా 0-4తో ముగిస్తుందని విశ్లేషకులు హేళన చేశారు. అయితే రెండు, నాలుగు టెస్టుల్లో విజయం, మూడో మ్యాచ్​ డ్రాతో ట్రోఫీని నిలబెట్టుకొని సగర్వంగా స్వదేశానికి రానుంది భారత జట్టు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.క్రేజీ అప్​డేట్..

చరణ్-తారక్​ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. అలానే ఓ ఫొటోను ట్వీట్ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details