జనవరి మూడో వారంలో
జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి చేస్తామని ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీని ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రెండు నెలల్లో పరిష్కారం
ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
లక్ష్యాలు ఉండాల్సిందే..
2020లో కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డామనీ... వాటి నుంచి తేరుకుని 2021కు స్వాగతం పలకాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
'డ్రై రన్'
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైనట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇదీ ప్రజాస్వామ్యంటే
కేరళలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు... పని చేస్తున్న బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారామె. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.